విక్రమ్ హీరోగా నటిస్తున్న ‘ధృవనక్షత్రం’ మూవీపై డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘'ధృవనక్షత్రం'ని 6 పార్టులుగా చేయాలనుకున్నాను. మొదట సూర్య, దీపికా పదుకొనె వంటి స్టార్స్‌తో ప్లాన్ చేశాను. వాళ్లు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయారు. నా సంపాదనంతా దీనిపైనే పెట్టేశాను. ‘ధృవనక్షత్రం’ కోసం చేసిన అప్పులు తీర్చడానికే వరుసగా సినిమాల్లో నటిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa