వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి సినిమా ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్లి లైఫ్ లో సక్సెస్ అయ్యారు. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. అయితే ఈ దీపావళిని మరింత స్పెషల్ గా మార్చారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎట్టకేలకు ఒక్కటైన విషయం తెలిసిందే. వీరి పెళ్లి ఇటలీలో చాలా గ్రాండ్ గా జరిగింది. డెస్టినీ వెడ్డింగ్ చేసుకుని ఈ జంట చాలా హ్యాపీగా ఉంది. ఒక పెళైన కొత్తలోని అనుభూతులను ఎంజాయ్ చేస్తున్నారు. తరచూ బయట సందడి చేస్తున్నారు.తాజాగా ఈ మెగా కొత్త జంట దీపావళి పండగ వేళ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఈ దివాళి సందడంతా వీరిదే అనేట్టుగా చేశారు. మొన్న నిహారిక సినిమా ఓపెనింగ్‌లో సందడి చేశారు.ఆ తర్వాత దీపావళిని ఇంట్లో మెగా ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నారు. దీవాళి పార్టీలోనూ పాల్గొన్నారు. ఇప్పుడు ఈ దీపావళి పండుగ సందర్భంగా స్పెషల్ ఫోటో షూట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో షూట్ పిక్స్ ని సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇందులో ఈ కొత్త జంట ఎంతో ముచ్చటగా ఉండటం విశేషం. ఇక ఈ ఫోటో షూట్‌లో రెడ్ లెహంగా చోళీలో లావణ్య త్రిపాఠి మెరిసిపోతుంది. మరోవైపు వరుణ్ తేజ్ బ్లాక్ కుర్తాలో మెరిశారు. పర్‌ఫెక్ట్ జోడీ అని చాటి చెబుతున్నారు. అంతేకాదు, కాస్త రొమాంటిక్‌గా ఫోటోలకు పోజులిస్తూ ఇంటర్నెట్ ఫోకస్ అంతా తమవైపు తిప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. కొత్తజంట అదిరిపోయిందని, ఎంతో చూడ ముచ్చటగా ఉన్నారని అంటున్నారు నెటిజన్లు. దీపావళి విషెస్ చెబుతూ దిష్టి తీసుకోమని కామెంట్లు పెడుతుండటం విశేషం.
The festive vibe is still lingering
The enchanting moments shared by the lovely couple Mega Prince @IAmVarunTej & @Itslavanya, spreading happiness during the Diwali celebrations. #VarunLav #VarunTej #LavanyaTripathi #DiwaliVibes pic.twitter.com/5VFSzcisCu
— Sriram Murthy (@murthymallala) November 14, 2023
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa