డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా 27 ఏళ్ల క్రితం వచ్చిన 'భారతీయుడు'కు సీక్వెల్‌గా 'భారతీయుడు-2' తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ వర్కింగ్ స్టిల్‌ను షేర్ చేశారు శంకర్. "సేనాపతిని తిరిగి తీసుకురావడానికి మీతో మళ్లీ పని చేసే అవకాశం రావడం అద్భుతం. మీరు మమ్మల్ని అలరిస్తూనే ఉంటారని.. మిలియన్ల మందికి స్పూర్తినిస్తూనే ఉంటారని ఆశిస్తున్నాను" అని ఆ స్టిల్‌కు క్యాప్షన్‌ను జోడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa