ఇటీవలే తన 168వ చిత్రం జైలర్‌తో రూ.700 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి కెరీర్ బెస్ట్ విజయన్ని సాధించిన రజనీకాంత్ ఆ తర్వాత వరుసబెట్టి సినిమాలను లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కూతురు సౌందర్య దర్శకత్వంలో చేస్తున్న169 సినిమా ’లాల్ సలామ్‘ షూటింగ్ పూర్తి చేసుకోగా 2024 సంక్రాతి విడుదలకు సిద్ధమైంది. అదేవిధంగా ’జైభీమ్‘ ఫేమ్ జ్ఞాన్‌వేల్ రాజా దర్శకత్వంలో చేస్తున్న 170వ చిత్రం షూటింగ్ ప్రారంభం అవగా ఇందులో పాన్ ఇండియా స్టార్స్ అమితాబ్ బచ్చన్, విలన్‌గా రానా, కొడుకుగా ఫహాద్ ఫాజిల్, మరో పాత్రలో మంజూ వారియర్ నటిస్తున్నారు. ఇక లోకేశ్ కనగరాజ్‌తో చేస్తున్న 171వ సినిమా మార్చిలో సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఇప్పుడు అందరి దృష్టి రజనీ, లోకేశ్ సినిమా పైనే పడింది. విక్రమ్, లియో వంటి భారీ బ్లాక్‌బస్టర్ హిట్స్ తర్వాత లోకేశ్ చేయబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు మరింతగా రెట్టింపయ్యాయి. పైగా ఈ సినిమా క్యాస్ట్ కోసం సమయం తీసుకుంటున్న దర్శకుడు ఓ ప్రధాన పాత్రకు రజనీకాంత్‌కు వీర భక్తుడైన లారెన్స్‌ను ఎంపిక చేసినట్లు, రజనీకి ప్రధాన విలన్‌గా నటిస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు బాగా వైరల్ అయ్యాయి. చంద్రముఖికి సీక్వెల్‌గా వచ్చిన చంద్రముఖి 2 సినిమా విడుదల సమయంలో లారెన్స్ రజనీకాంత్‌ను కలిసి కౌగిలించుకుని ఆశ్వీర్వాదం తీసుకోవడం ఇప్పుడు ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నది. కాగా ఈ విషయమై ఇంతవరకు అధికారికంగా సమాచారం లేనప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్‌లో ఈ వార్తను ట్రెండింగ్ చేస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిచనున్నట్లు మేకర్స్ గంతలో ప్రకటించినా ఇతర నటీనటుల విషయాలు వెల్లడించలేదు. అయితే ఈ సినిమా లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఉంటుందా లేక సపరేట్‌గా ఉంటుందా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. మరికొన్ని రోజులైతే ఈ విషయంలో క్లారిటీ రానుంది. ప్రస్తుతం లారెన్స్ హీరోగా చేసిన జిగర్తాండ 2 వచ్చే వారం విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa