చిన్న సినిమాగా వచ్చి బేబీ సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. రూ.10 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ.100 కోట్లకు పైనే కలెక్షన్లు రాబట్టి ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా హృదయ కాలేయం, కలర్‌ఫొటో చిత్రాలకు నిర్మాతగా కొబ్బరిమట్ట చిత్రానికి దర్శకత్వం వహించిన సాయి రాజేశ్ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. అంతా తెలుగు టెక్నీషియన్స్‌తోనే చేసిన ఈ చిత్రం యూత్‌ను తెగ ఆకట్టుకుంది. గతంలో అర్జున్ రెడ్డి సినిమాకు వచ్చినట్టుగానే బేబీకి ప్రత్యేక క్రేజ్ రావడంతో బాక్సిఫిస్ వద్ద ఈ సినిమా రికార్డులు తిరగరాసింది. విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లగా ఇప్పటికీ ఈ సినిమా పాటలు టాప్5లో ఉంటూ ట్రెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో బేబీ సినిమాకు దర్శకత్వం వహించిన సాయి రాజేశే ఓ బడా నిర్మాణ సంస్థతో కలిసి సహ నిర్మాతగా హిందీ వెర్షన్‌ను తెరకెక్కించనున్నారు. కాగా ఈ సినిమాకు హీరోగా ప్రముఖ బాలీవుడ్ హీరో బాబీ డియోల్ తనయుడు అర్యమాన్‌ను అనంద్ పాత్రకు తీసుకుంటున్నట్లు వార్తలు రాగా, కొత్త అమ్మాయిని హీరోయిన్‌గా పరిచయం చేయనున్నట్లు తెలస్తోంది. ఇదిలాఉండగా గతంలోనూ తెలుగులో బ్లాక్‌బస్టర్ విజయాలు సాధించిన కిక్, రెడీ, ఛత్రపతి, జెర్సీ, అలా వైకుంఠపురములో, అర్జున్ రెడ్డి వంటి సినిమాలు హిందీలో రిమేక్ అయ్యాయి. అందులో కిక్, రెడీ, అర్జున్ రెడ్డి చిత్రాలు మంచి విజయం సాధించగా ఛత్రపతి, జెర్సీ, అలా వైకుంఠపురములో సినిమాలు మిశ్రమ స్పందనను రాబట్టాయి. మరి ఈ బేబీ సినిమా బాలీవుడ్‌లో విజయం సాధిస్తుందా లేక నిరుత్సాహా పరుస్తుందో వేచి చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa