సన్నబడిన అను ఇమ్మానియేల్ అందాలు సరికొత్తగా తోస్తున్నాయి. అమ్మడు నడుము సన్నజాజి తీగకంటే నాజూగ్గా తయారైంది. అను ఇమ్మానియేల్ లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది. అను ఇమ్మానియేల్ లేటెస్ట్ మూవీ జపాన్. హీరో కార్తీకి జంటగా నటించింది. పీరియాడిక్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన నవంబర్ 10న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటుంది అను. దర్శకుడు రాజు మురుగన్ తెరకెక్కించిన జపాన్ లో కార్తీ దొంగ పాత్ర చేశాడు. జపాన్ ట్రైలర్ ఆకట్టుకుంది. కార్తీ గెటప్, క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉన్నాయి. హిట్ కోసం తపిస్తున్న అను ఇమ్మానియేల్ కి జపాన్ తో విజయం దక్కే సూచనలు కలవు. అను ఇమ్మానియేల్ కి ఇది లాస్ట్ ఛాన్స్. హిట్ కొడితేనే కెరీర్ నిలబడే పరిస్థితి ఉంది. ఈ ఏడాది రావణాసురతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. రవితేజ నటించిన యాక్షన్ క్రైమ్ డ్రామా ఆకట్టుకోలేదు. గత ఏడాది ఊర్వశివో రాక్షసివో చిత్రంలో నటించింది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కమర్షియల్ గా ఆడలేదు. హీరో అల్లు శిరీష్ తో ముద్దు సన్నివేశాల్లో మొహమాటం లేకుండా నటించింది. ఈ క్రమంలో అల్లు శిరీష్ తో ఎఫైర్ అంటూ వార్తలు వచ్చాయి. ఒక దశలో అను ఇమ్మానియేల్-అల్లు శిరీష్ ముంబైలో కలిసి ఉంటున్నారన్న కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే ఈ వార్తలను అను ఇమ్మానియేల్ ఖండించింది. మేము స్నేహితులం మాత్రమే. అంతకు మించిన బంధం లేదని అన్నారు. అను ఇమ్మానియేల్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టింది. తెలుగు మూవీ మజ్ను తో హీరోయిన్ అయ్యింది. నాని హీరోగా నటించిన మజ్ను సూపర్ హిట్ కొట్టింది. అజ్ఞాతవాసి, నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా వంటి టాప్ స్టార్ చిత్రాల్లో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది.
Radiant and resplendent, @ItsAnuEmmanuel captivated hearts with her stunning beauty at the Grand Pre-Release Event of #Japan#Anuemmanuel pic.twitter.com/Emu3OYRKVu
— Suresh PRO (@SureshPRO_) November 3, 2023
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa