రజినీకాంత్ తలైవర్ 170 మూవీ బిగ్ అప్డేట్ ను మూవీ మేకర్స్ పంచుకున్నారు. జైభీమ్ దర్శకుడు టీజే జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ , రజినీకాంత్ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. తలైవర్ 170 సెట్స్ లో షెహంషా అమితాబ్ బచ్చన్ కలిసిన వేళ.. 33 ఏళ్ల తరువాత ఈ అరుదైన కలయిక. తలైవర్ 170 డబుల్ డోస్.. ముంబై లో షెడ్యూల్ పూర్తయ్యిందని తెలిపారు.