యంగ్ బ్యూటీ పాయల్ రాజ్ పూత్ ప్రస్తుతం మంచి హిట్ కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో మరోసారి తన ఫేవరెట్ డైరెక్టర్ తో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమా బిజీలోనే ఉంది.‘ఆర్ ఎక్స్ 100’తో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్ పూత్ . ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. మంచి క్రేజ్ దక్కేందుకు కారణమైన ఈయన పాయల్ కు ఫేవరెట్ డైరెక్టర్ అనిచెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తొలిచిత్రంతోనే తెలుగు ఆడియెన్స్ మంచి గుర్తింపు దక్కించుకోవడంతో వరుసగా సినిమా ఆఫర్లు అందాయి. ‘వెంకీ మామా’, ‘డిస్కో రాజా’, ‘తీస్ మార్ ఖాన్’, ‘జిన్నా’, ‘మాయాపేటిక’ వంటి చిత్రాలతో తెలుగులో మరింతగా క్రేజ్ దక్కించుకుంది.అటు తమిళంలోనూ వీలునుప్పడుల్లా సినిమాలు చేస్తూనే వస్తోంది. ఇలా తమిళం తెలుగులో వరుస చిత్రాల్లో నటిస్తూనే ఉంది. కానీ ఈ ముద్దుగుమ్మకు సరైన హిట్ పడటం లేదు. ఆర్ ఎక్స్ 100 తర్వాత అలాంటి సక్సెస్ ఇప్పటి వరకు చూడలేదీ ముద్దుగుమ్మ.దీంతో మరోసారి దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘మంగళవారం’ అనే సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్ కూడా షురూ అయ్యాయి. ప్రస్తుతం ఈ చిత్రంపైనే పాయల్ ఆశలు పెట్టుకుంది.మరోవైపు స్టన్నింగ్ ఫొటోషూట్లతో గ్లామర్ విందు చేస్తోంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ లెహంగా, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో దర్శనమిచ్చింది. దుప్పట్టా లేకుండానే మిర్రర్ ముందుకు మతులు పోయేలా అందాల ప్రదర్శన చేసింది. కవ్వించే ఫోజులతో కలవరపెట్టింది. మత్తు చూపులతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
#PayalRajput pic.twitter.com/yU5J2Nw75x
— Star Gallery (@stargallery2020) October 29, 2023
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa