పవర్‌ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన పాన్-ఇండియా సినిమా 'స్కంద-ది ఎటాకర్' సెప్టెంబర్ 28, 2023న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం నవంబర్ 2, 2023 నుండి అన్ని ప్రధాన భారతీయ భాషలలో ప్రసారానికి అందుబాటులో ఉంటుందని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అధికారికంగా ప్రకటించింది.
ఈ సినిమాలో రామ్ సరసన శ్రీలీల జోడిగా నటిస్తుంది. ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఫుల్ మాస్ ఎలిమెంట్స్‌తో రానున్న ఈ సినిమాని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa