స్టార్స్ లైఫ్ స్టైల్ చాలా విలాసవంతంగా ఉంటుంది. స్టేటస్ లో భాగంగా వారి కార్ల కలెక్షన్ సామాన్యుల మతిపోయేలా చేస్తుంది. టాలీవుడ్ స్టార్స్ వద్ద రోల్స్ రాయిస్, రేంజ్ రోవర్, లాంబోర్గిని, బెంజ్, ఆడి, ఫెరారీ వంటి లగ్జరీ కార్స్ కలెక్షన్ ఉంది.ప్రభాస్ అప్పుడప్పుడు తన వద్ద ఉన్న ఆరెంజ్ కలర్ లంబోర్గినిలో షికార్లు కొడుతూ ఉంటాడు. సినిమా వాళ్ళు ఇష్టపడే కార్ బ్రాండ్స్ లో లాంబోర్గిని ఒకటి. తాజాగా సాహో హీరోయిన్ లాంబోర్గిని కారు సొంతం చేసుకుంది. లాంబోర్గిని హై ఎండ్ మోడల్స్ లో ఒకటైన కారును శ్రద్దా కపూర్ కొన్నారు.
రెడ్ లాంబోర్గిని హరికేన్ టెక్నీక మోడల్ కి చెందిన ఈ కారు ధర అక్షరాలా రూ. 4.8 కోట్లు. దాదాపు ఐదు కోట్ల రూపాయల విలువైన కారులో ఆమె షికారు చేయనున్నారు. శ్రద్దా కపూర్ కొత్త కారు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లాంబోర్గిని ముంబై ప్రతినిధి పూజ చౌదరి తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు. అలాగే రెడ్ లాంబోర్గినిలో శ్రద్దా షికార్లు కొడుతున్న ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఫ్యాన్స్ శ్రద్దా కపూర్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
నటుడు శక్తి కపూర్ కూతురైన శ్రద్దా కపూర్ 2010లో తీన్ పత్తి చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఆషీకీ 2 సినిమాకు బ్రేక్ ఇచ్చింది. భారీ మ్యూజికల్ హిట్ గా ఆషీకీ 2 నిలిచింది. సాహో చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ప్రభాస్-సుజీత్ కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.హిందీలో సాహో విజయం సాధించడం విశేషం. సాహో హిందీ వర్షన్ రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. శ్రద్దా కపూర్ స్టార్ గా ఎదగలేకపోయింది. ఆమె కెరీర్లో హిట్స్ ఉన్నా ఓ స్థాయికి వెళ్లలేకపోయింది. గత ఏడాది వరుణ్ ధావన్ కి జంటగా బేడియా చిత్రం చేసింది. ఆ మూవీ అంతగా ఆడలేదు. రన్బీర్ కపూర్ కి జంటగా తూ జూతి మే మక్కార్ మూవీలో నటించింది. ప్రస్తుతం శ్రద్ధా కపూర్ స్ట్రీట్ 2 చిత్రంలో నటిస్తుంది.
#InPhotos | #ShraddhaKapoor welcomed home a red #Lamborghini #HuracanTecnica worth around ₹4.8 crore. pic.twitter.com/RDxjy5jYAD
— Thriller Soundtrack Music (@sandeeprathi100) October 26, 2023
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa