'భగవంత్ కేసరి' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో బాలకృష్ణ గురించి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట ఆసక్తికరంగా మారాయి. “నా మొదటి జీతం బాలకృష్ణ సినిమా భైరవద్వీపం నుంచే తీసుకున్నాను. నా తొమ్మిదేళ్ళ వయసులో ఆయన సినిమాకి పనిచేశాను. నా కడుపు నింపిన మనిషిగా బాలకృష్ణతో ఎంతో మంచి అనుబంధం వుంది. అఖండ, వీరసింహరెడ్డి.. తర్వాత ఈ చిత్రం మా ఇద్దరికి హ్యాట్రిక్. ఇది ఫిక్స్" అని ప్రేక్షకులకు చెప్పారు.