మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రంలో ప్రభాస్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మోహన్‌లాల్ సైతం ఈ సినిమాలో మెరుస్తారని వార్తలొచ్చాయి. ఇప్పుడు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తున్నారంటూ చిత్రబృందం ప్రకటించింది. అయితే శివన్న ఏ పాత్రలో నటిస్తున్నారో స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం న్యూజీలాండ్‌లో చిత్రీకరణ జరుగుతోంది. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్న చిత్రమిది. మోహన్‌బాబు నిర్మాత. ప్రభాస్ - నయనతార శివ పార్వతులుగా కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయమై చిత్రబృందం అధికారికంగా స్పందించాల్సివుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa