విమానంలో ఒక ప్రయాణీకుడు తనను వేదించాడని మలయాళ సినీ నటి దివ్య ప్రభ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబై నుండి కేరళలోని కొచ్చికి ఎయిర్ ఇండియా విమానంలో వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. పదే పదే ఎయిర్ హోస్టెస్ కు తెలిపినా పట్టించుకోలేదన్నారు. ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదును అందుకున్న నేడుంబరస్సేరి పోలీసులు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa