ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారినుండి ఎంతో నేర్చుకున్నా

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 10, 2023, 09:06 AM

హిందీ చిత్ర పరిశ్రమలో సక్సెస్‌ఫుల్‌గా సాగుతుండగానే హాలీవుడ్‌లో అవకాశం అందుకున్నారు బాలీవుడ్‌ బ్యూటీ ఆలియాభట్‌. ‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’తో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆలియా. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ...  దర్శకులు సంజయ్‌లీలా భన్సాలీ, కరణ్‌ జోహార్‌ల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు చెప్పారు. ఆలియా మాట్లాడుతూ "నేను పని చేసిన ప్రతి సినిమా నుంచి ఏదో ఒక విషయాన్ని నేర్చుకున్నాను. నేను సెట్‌ అందరితో కలిసిమెలసి ఉంటాను. అందుకు కారణం షారుక్‌ఖాన. ప్రతి సన్నివేశాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఆయనను చూసే తెలుసుకున్నా. నాపై ప్రభావం చూపిన వ్యక్తుల్లో షారుక్‌ ఒకరు’’ అని తెలిపారు. తను పని చేసిన దర్శకుల గురించి కూడా ఆలియా మాట్లాడారు. ‘‘గంగూబాయి కాఠియావాడి’ సినిమా కోసం మొదటిసారి సంజయ్‌లీలా భన్సాలీతో కలిసి పనిచేశాను. ఆయన సినిమా సెట్‌కు కొత్త ప్రపంచాన్ని తలపిస్తుంది. అక్కడ ప్రతి సందేహానికి జవాబు దొరుకుతుంది. కెమెరా ముందు ఏదైనా చేయగలమనే ధైర్యం వస్తుంది. ఎంతో స్వేచ్ఛ లభిస్తుంది. గౌరవం అనేది కరణ్‌ జోహర్‌ నుంచి నేర్చుకున్నా. ప్రతి విషయంపై అవగాహన పెంచుకోవడం నేర్చుకున్నా. వీళ్లిద్దరూ భిన్నమైన భావజాలాలు కలిగిన వ్యక్తులు కానీ నా జీవితంపై ఎంతో ప్రభావం చూపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే వీరిద్దరూ నా మెంటర్స్‌’. ఇద్దరూ నాకెంతో కీలకం’’ అని ఆమె అన్నారు. ఈ ఏడాది రణ్‌వీర్‌ సింగ్‌తో నటించిన ‘రాకీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ’ మంచి విజయాన్ని సాధించింది. అతిథి పాత్రలో నటించిన ‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’ కూడా చక్కని విజయం సొంతం చేసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa