ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ డైలాగ్‌ అక్కడ అవసరమే

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 10, 2023, 08:54 AM

హీరో విజయ్‌ నటించిన తాజా చిత్రం ‘లియో’ కు సంబంధించిన ట్రైలర్‌ను ఈ నెల 5న విడుదల చేయగా, అందులో ఓ అసభ్య పదజాలంతో కూడిన డైలాగ్‌ ఉంది. ఇది పెను దుమారం రేపింది. ఈ వివాదానికి పూర్తి బాధ్యత తనదేనని లియో దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ స్పష్టం చేశారు. ఈనెల 19న లియో విడుదలకానుంది. దీన్ని పురస్కరించుకుని తాజాగా జరిగిన ఓ ప్రమోషన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ డైలాగ్ వివాదం గురించి మాట్లాడుతూ.. ‘‘సినిమాలో కచ్చితంగా ఆ డైలాగ్‌ ఉండాలి. అమాయకుడైన ఒక వ్యక్తి తీవ్ర మనోవేదనకు గురై అలా మాట్లాడుతారు. ఆ డైలాగ్‌ ఏ ఒక్కరినీ నొప్పించాలన్నది ఉద్దేశం కాదు. దీనిపై చెలరేగిన వివాదానికి పూర్తి బాధ్యత నాదే. దీనికి, విజయ్‌ కు ఎలాంటి సంబంధం లేదు. ఈ షాట్‌ చిత్రీకరణ సమయంలో ఈ డైలాగ్‌ అవసరమా? అని విజయ్‌ ప్రశ్నించగా, కథ డిమాండ్‌ మేరకు ఉండాలని చెప్పాను అని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa