ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆదిపురుష్‌ పై నమోదైన కేసుల కొట్టివేత

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 10, 2023, 08:39 AM

ప్రభాస్‌ శ్రీరాముడిగా ఓం రౌత్‌ దర్శకత్వం వహించిన ఆదిపురుష్‌ చిత్రం హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉందనీ, రామాయణంలో పాత్రలను వక్రీకరించారని కొందరు కేసులు పెట్టారు. తాజాగా వాటన్నింటినీ కొట్టేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. రామాయణం ఇతివృత్తంగా రూపొందిన ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు మతానికి సంబంధించిన కొందరి మనోభావాలు దెబ్బ తీేసలా ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. హనుమంతుడి సంభాషణల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ చిత్ర నిర్మాతపై కేసులు పెట్టారు. ఈ చిత్రంపై నమోదైన కేసులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ ఇచ్చాక.. ఏ విషయంలోనూ విచారణలు అవసరం లేదు. వీటికి ముగింపు పలకండి’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనిపై వివిధ కోర్టులో జరుగుతున్న వాదనలు అన్ని వ్యర్థమైనవని కోర్టు పేర్కొంది. ఈ వివాదంపై జరుగుతున్న విచారణలన్నీ అనవసరమైనవని జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ సోమవారం వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa