సినిమా ప్రొమోషన్స్‌లో భాగంగా జరుగుతున్న హీరో సిద్ధార్థ్ ప్రెస్‌మీట్‌ను గురువారం కరవే (కర్ణాటక రక్షణ వేదిక) స్వాభిమాని సేన సభ్యులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా హీరో సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెప్పారు. ఇలా కళాకారులను హింసించడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు అన్నారు. ‘ఒక కన్నడిగుడిగా, నా తోటి కన్నడిగుల తరపున తరపున సిద్ధార్థ్ క్షమించు’ అని ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa