ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'యానిమల్' టీజర్ అవుట్

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 28, 2023, 04:04 PM

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్‌తో సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాకి 'యానిమల్' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. తాజాగా  ఈరోజు మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ ని విడుదల చేసారు. టీజర్ లో నటుడి లుక్, బాడీ లాంగ్వేజ్, ఇంటెన్సిటీ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక రణబీర్‌తో రొమాన్స్ చేయనుంది.


యానిమల్ డిసెంబర్ 1, 2023న హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల కానుంది. రణబీర్ కపూర్ ఈ సినిమాలో ఇంటెన్సివ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ అండ్ సినీ1 స్టూడియోస్ నిర్మిస్తున్నాయి .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa