ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్‌ దేవరకొండ క్రొత్త సినిమా పేరు అదేనా...?

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 28, 2023, 03:43 PM

విజయ్‌ దేవరకొండ - పరశురామ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘గీతగోవిందం’ ఎంత పెద్ద విజయాన్ని అందుకొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఈ కలయికలో మరో చిత్రం రూపుదిద్దుకొంటోంది. దిల్‌రాజు నిర్మాత. మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ఈ సినిమా టైటిల్‌ ప్రకటిస్తారు. ప్రస్తుతానికి ‘ఫ్యామిలీ స్టార్‌’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. దాన్నే ఫైనల్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ‘‘కుటుంబ బంధాలకు ప్రాధాన్యం ఇచ్చే కథ ఇది. విజయ్‌కి కొత్త ఇమేజ్‌ తీసుకొస్తుంది. విజయ్‌ - మృణాల్‌ జోడీ చూడ ముచ్చటగా ఉంటుంద’’ని చిత్ర బృందం తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa