ఇటీవల మైసూర్‌లోని ఓ మ్యూజియంలో ప్రభాస్ మైనపు విగ్రహం ఏర్పాటు చేసిన విషయంలో నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ మండిపడ్డ విషయం తెలిసిందే! ‘బాహుబలి’లోని అమరేంద్ర బాహుబలి పాత్రకు సంబంధించిన ఈ మైనపు విగ్రహంపై శోభు ట్వీట్ చేశారు. తమ దృష్టికి తీసుకురాకుండా ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఏర్పాటు చేశారని, దానిని తొలగించేలా చర్యలు తీసుకుంటామని ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు. అంతే కాదు ఆ విగ్రహం అసలు ప్రభాస్‌ను పోలి లేదని అభిమానులు మండిపడిన సంగతి తెలిసిందే! నెట్టింట ఈ విషయం విపరీతంగా ట్రోల్ అవుతోంది. దీనిపై సదరు మ్యూజియమ్ నిర్వాహకులు స్పందించారు. ‘‘ఎవరి మనోభావాలు దెబ్బ తీయాలని ఆ విగ్రహం పెట్టలేదు. మ్యూజియంలోని ప్రభాస్ విగ్రహంపై చిత్ర నిర్మాత నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే దీన్ని తొలగించాలని నిర్ణయించుకున్నాం’’ అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa