కేరళలో వరదల నేపథ్యంలో తెరకెక్కిన '2018' సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది. 2024 ఆస్కార్ అవార్డులకు భారత్ తరుపున అధికారిక ఎంట్రీగా ఈ సినిమా ఎంపికైంది. ఈ విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బుధవారం ప్రకటించింది. డైరెక్టర్ జూడ్ ఆంథోనీ జోసెఫ్ తెరకెక్కించిన ఈ సినిమాలో టొవినో థామస్ ప్రధాన పాత్రలో నటించారు. 5 మే 2023న విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు మలయాళంలో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa