రామ్ కార్తిక్, హెబ్బా పటేల్ కీలక పాత్రల్లో నటించిన మిస్టరీ థ్రిల్లర్ ‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’. వెన్నులో వణుకుపుట్టించే ఉత్కంఠభరితమైన థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. నరేష్ వీకే, పవిత్రా లోకేష్ , జయప్రకాష్ వంటి వారు కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాను విప్లవ్ కోనేటి డైరెక్ట్ చేయడంతో పాటు.. ఆయనే స్వయంగా నిర్మించారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆహా ఓటీటీలో అక్టోబర్ 6న నుండి స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ వారు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్ర కథ విషయానికి వస్తే.. మదనపల్లి టౌన్‌లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ తెరకెక్కింది. ఎమోషనల్ డ్రామా, మనసును తాకే థ్రిల్స్, అనూహ్యమైన రొమాన్స్, అన్నిటి మేళవింపుగా అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని మేకర్స్ చెబుతున్నారు. అనూహ్యమైన రీతిలో సాగే ఈ సినిమాలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడాలనుకుంటుంది. అసలు వాళ్ల ఉద్దేశం ఏంటి? మళ్లీ పుట్టడమేనా? ఈ కథను ముందుకెళుతున్న కొద్దీ అనూహ్యమైన ట్విస్టులు, సస్పెన్స్, డ్రామా, రొమాన్స్... ఇలాంటివి ఎన్నెన్నో కళ్లముందు కదలాడుతుంటాయని, వెన్నులో వణుకుపుట్టించే సన్నివేశాలు ఇందులో పుష్కలంగా ఉంటాయని దర్శకనిర్మాత విప్లవ్ కోనేటి తెలుపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa