విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకుడుగా, నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా సంక్రాంతి బరిలోకి వస్తోందని అధికారికంగా ఈరోజు ప్రకటించారు. ఇందులో మృణాల్ ఠాకూర్ కథానాయకురాలిగా చేస్తోంది. ఈ సందర్భంగా ఈరోజు ఒక అధికార ప్రకటన విడుదల చేస్తూ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది అని, వీడీ 13గా పిలుస్తున్న ఈ సినిమా నుంచి నిర్మాతలు ఆ సినిమా షూటింగ్ ప్రోగ్రెస్ ను ఇవాళ వెల్లడించారు. ఈ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని అలాగే రానున్న సంక్రాంతి పండుగకు గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. 'గీత గోవిందం' వంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తున్నామని మేకర్స్ చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa