ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘మ్యాడ్’ నుండి మరో పాట విడుదల

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 27, 2023, 12:14 PM

టాలీవుడ్ అగ్రగామి నిర్మాణ సంస్థ అయిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తమ క్రేజీ అండ్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’తో అలరించడానికి 2023, అక్టోబర్ 6న వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఓ మాంచి మెలోడీ సాంగ్‌‌ని మేకర్స్ వదిలారు. ‘నువ్వు నవ్వుకుంటూ’ అంటూ సాగే ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చగా, కపిల్ కపిలన్ ఆలపించారు. పాట సందర్భానికి తగ్గట్టుగా గీత రచయిత భాస్కరబట్ల యూత్‌ఫుల్ మరియు రొమాంటిక్ లిరిక్స్ రాశారు. ప్రస్తుతం ఈ సాంగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. రామ్ నితిన్, సంగీత్ శోభన్, నార్నే నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌ కుమార్, గోపికా ఉద్యన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. మ్యాడ్ సినిమాతో హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతుండగా.. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఎంటర్‌టైన్ చేస్తుందని మేకర్స్ తెలుపుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa