టాలీవుడ్ హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ మాదాపూర్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. డ్రగ్స్ ముఠాతో నవదీప్‌కు సంబంధం ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో నవదీప్ పేరును ఏ29గా చేర్చారు. ఇప్పటికే ఈ కేసులో డియర్ మేఘ చిత్ర దర్శకుడు అనుగు సుశాంత్ రెడ్డి, ఫైనాన్షియర్ కె.వెంకటరమణారెడ్డితో సహా 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.