అవనీంద్ర దర్శకత్వంలో నవదీప్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘లవ్ మౌళి’. ప్రశాంత్ రెడ్డి తాటికొండ నిర్మాత. ఈ చిత్రం నుంచి ‘అందాలు చదివే కళ్లకైనా’ అంటూ సాగే గీతాన్ని విడుదల చేశారు. గోవింద వసంత స్వరాలు సమకూర్చారు. అనంత శ్రీరామ్ రాశారు. అనిస్ కృష్ణన్ ఆలపించారు. ‘‘మేఘాలయాలోని అందమైన లొకేషన్లలో ఈ పాటని తెరకెక్కించాం. నవదీప్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోయే చిత్రమిది. ఆయన గెటప్ కొత్తగా ఉంటుంది అని దర్శక నిర్మాతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa