ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'స్కంద' నుండి ఎనర్జిటిక్ ట్రాక్ కల్ట్ మామా అవుట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 18, 2023, 04:02 PM

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని పవర్‌ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో పాన్-ఇండియా సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. నిర్మాతలు ఈ చిత్రానికి 'స్కంద-ది ఎటాకర్' అనే టైటిల్ ని పెట్టారు. తాజాగా ఈరోజు మూవీ మేకర్స్ ఈ యాక్షన్ చిత్రం నుండి హై-ఎనర్జీ పాట కల్ట్ మామా సాంగ్ ను విడుదల చేశారు. డ్యాన్స్ సెన్సేషన్ ఊర్వశి రౌతేలా ఈ స్పెషల్ సాంగ్‌కి తన మ్యాజిక్‌ను జోడించింది. థమన్ కంపోజ్ చేసిన ఈ పాటకు హేమ చంద్ర, రమ్య బెహెరా మరియు మహా తమ గాత్రాలని అందించారు.

ఈ సినిమాలో రామ్ సరసన శ్రీ లీల జోడిగా నటిస్తుంది. ఈ సినిమా సెప్టెంబర్ 28, 2023న విడుదలవుతోంది. ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఫుల్ మాస్‌ ఎలిమెంట్స్‌తో రానున్న ఈ సినిమాని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa