ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ అంచనాలతో వస్తున్న సలార్ మూవీ విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ చేయాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో విడుదల చేయలేకపోతున్నామని తెలిపింది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని తెలిపింది. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతిహాసన్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa