ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'చంద్రముఖి 2' కోసం సుదీర్ఘ రన్‌టైమ్ లాక్

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 12, 2023, 07:42 PM

పి వాసు దర్శకత్వంలో స్టార్ కొరియోగ్రాఫర్‌-నటుడు-దర్శకుడు రాఘవ లారెన్స్ 'చంద్రముఖి 2' సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో హిందీ నటి కంగనా రనౌత్ కథానాయికగా నటిస్తోంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ హర్రర్ కామెడీ చిత్రం సెప్టెంబర్ 15, 2023న విడుదల కానుంది.


లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ సినిమా 170 నిమిషాల రన్ టైమ్ ని (2 గంటల 50 నిమిషాలు) ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో వడివేలు, రాధికా శరత్‌కుమార్, లక్ష్మీ మీనన్ మరియు ఇతరులు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ MM కీరవాణి సంగీత దర్శకుడు, ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa