ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమా సహకారంతో 'MAD' అనే యూత్‌ఫుల్ మూవీని నిర్మిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో అతనితో పాటు రామ్ నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలు పోషించారు.
మొదట్లో మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసి సెప్టెంబర్ 28, 2023కి విడుదల తేదీని లాక్ చేసినట్లు వెల్లండించారు. అయితే ఫస్ట్ సింగిల్ అనౌన్స్‌మెంట్ కోసం విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో రిలీజ్ డేట్ లేకపోవడంతో పరోక్షంగా ఈ సినిమా కొత్త తేదీకి వాయిదా పడినట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ చిత్రం ఇప్పుడు అక్టోబర్ 6, 2023న విడుదల కానుందని సమాచారం. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హారిక సూర్యదేవర నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అననతిక సనీల్‌కుమార్ మరియు ఇతరులు కూడా ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు. ఈ యూత్ ఫుల్ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa