తమిళ సూపర్‌స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం మలేషియా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంను మర్యాదపూర్వకంగా కలిసి కాసేపు ముచ్చటించారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను ప్రధాని అన్వర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ‘ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న రజనీని కలవడం ఆనందంగా ఉంది. ప్రజల కష్టాలు, ఆ కష్టాల సమయంలో తాను అందించిన సేవల పట్ల ఆయన గౌరవం ప్రదర్శించారు’ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa