‘జైలర్’ మూవీ బాక్సాఫీసు వద్ద భారీ హిట్‌గా నిలిచింది. దాదాపు రూ.650 కోట్ల వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఇటీవలే ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చి అక్కడ కూడా ఊహించని రెస్పాన్స్ అందుకుంటుంది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం 29 దేశాలలో ట్రెండ్ అవుతోంది. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ మూవీ మరో రికార్డు సాధించింది. తమిళనాడు బాక్సాఫీసు వద్ద రూ.100 కోట్ల షేర్ రాబట్టిన మొట్టమొదటి భారతీయ చిత్రంగా నిలిచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa