తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘జవాన్’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జవాన్ మూవీ ప్రీమియర్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ఈ మూవీ సోషల్ మీడియా వేదికగా బ్లాక్ బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. ‘మూవీ చాలా బాగుంది, ముఖ్యంగా ఆరంభం నుంచే అట్లీ మనల్ని కుర్చీలకు అతుక్కునేలా చేశాడు. భారీ యాక్షన్ సన్నివేశాలు, కథనం ఆకట్టుకున్నాయి’ అంటూ రివ్యూలు ఇస్తున్నారు.