సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ అమెరికన్ సింగర్, గేయ రచయిత జిమ్మీ బఫ్ఫెట్(76) కన్నుమూశారు. సెప్టెంబర్ 1వ తేదీన ఆయన మరణించారణి స్థానిక మీడియా వెల్లడించింది. అయితే బఫ్ఫెట్ మృతికి గల కారణాలు తెలియరాలేదు. అమెరికాలోని మిస్సిస్సిప్పిలో జన్మించిన ఆయన.. 50 సంవత్సరాల తన కెరీర్‌లో దాదాపు 27 స్టూడియో ఆల్బమ్‌లను విడుదల చేశాడు. 'మార్గరెట్ విల్లే' ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.