పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘సలార్’ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు సంబంధించి నటి శ్రుతిహాసన్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. ‘సలార్’లో తన పాత్ర కోసం డబ్బింగ్ చెప్పడం షురూ చేసినట్లు తెలిపింది. మొత్తం ఐదు భాషల్లోనూ తన సొంత గొంతునే వినిపించనున్నట్లు పేర్కొంది. ప్పటికే మూడు భాషలకు సంబంధించిన డబ్బింగ్ పనులు పూర్తయ్యాయని వివరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa