డీజే టిల్లు మూవీతో ఫేమ్ తెచ్చుకున్న నేహా శెట్టి బెదురులంక 2012 మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్తికేయ-నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం బెదురులంక 2012. ఆగస్టు 25న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకగా హైదరాబాద్ లో నిర్వహించారు. బెదురులంక 2012 ట్రైలర్ ఆకట్టుకుంది. యుగాంతం జరిగిపోతుందనే భ్రమలో గోదావరి మధ్యలో ఉన్న ఓ గ్రామ ప్రజలు ఏం చేశారు. వాళ్ళ భయాలను కొందరు ఎలా స్వార్థానికి వాడుకోవాలని అనుకున్నారనేదే బెదురులంక 2012 చిత్ర కథాంశం.అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యర్, ఆటో రామ్ ప్రసాద్ కీలక రోల్స్ చేశారు. దర్శకుడు క్లాక్స్ బెదురులంక 2012 చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక బెదురులంక 2012 చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో నేహా శెట్టి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్లీవ్ లెస్ జాకెట్, డిజైనర్ శారీలో ఆమె మెరిసిపోయింది. ఈవెంట్లో అందరి చూపు నేహా శెట్టి మీదే పడింది. ఇక నేహా కెరీర్ పరిశీలిస్తే ఆమె మెహబూబా చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది. ఆకాష్ పూరి హీరో కాగా దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించాడు. ఈ మూవీ నిరాశపరిచింది. 2022లో విడుదలైన డీజే టిల్లు మూవీలో నేహా శెట్టి బోల్డ్ రోల్ చేసింది. ఆమె నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకుంది. సిద్దూ హీరోగా నటించిన డీజే టిల్లు భారీ విజయం సాధించింది.
#NehaShetty Latest Photos at #Bedurulanka2012 PreRelease Event [HD]
https://t.co/VhGQ7gE5NQ#Bedurulanka2012onAUG25 @iamnehashetty pic.twitter.com/kSpl2VgU1K
— FilmyTime (@Filmy_Time) August 23, 2023
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa