నటుడు, బీజేపీ ఎంపీ సన్నీ డియోల్‌కు ఊరట దక్కింది. రూ.56 కోట్ల లోన్ చెల్లించకపోవడంతో ముంబైలోని జుహు ప్రాంతంలో ఆయన బంగ్లాను జప్తు చేయనున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆదివారం ప్రకటించింది. ఆ నోటీసులను సాంకేతిక కారణాల వల్ల ఉపసంహరించుకున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా సోమవారం ప్రకటించింది. ఎవరి ఒత్తిడి వల్ల నోటీసులను బ్యాంకు ఉపసంహరించుకుందని కాంగ్రెస్ ట్విట్టర్‌లో ప్రశ్నించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa