అభిలాష్ జోషి దర్శకత్వంలో మాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ ఒక గ్యాంగ్‌స్టర్ డ్రామాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాకి 'కింగ్ ఆఫ్ కోత' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేశారు. ఈ గ్యాంగ్‌స్టర్ సినిమాకి అభిలాష్ ఎన్.చంద్రన్ కథను అందించారు.
తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ చిత్రం 2023 ఆగస్టు 24న ప్రధాన భారతీయ భాషల్లో థియేటర్లలోకి రానుంది. ముఖ్యంగా చెన్నైకి చెందిన డిస్ట్రిబ్యూషన్ కంపెనీ E4 ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణల్లో విడుదల చేస్తున్నట్లు సమాచారం.
ఈ పాన్-ఇండియన్ మూవీలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంలో డ్యాన్సింగ్ రోజ్, ప్రసన్న, ఐశ్వర్య లక్ష్మి, నైలా ఉష, చెంబన్ వినోద్, గోకుల్ సురేష్, షమ్మి తిలకన్, శాంతి కృష్ణ, వడ చెన్నై శరణ్, అనిఖా సురేంద్రన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
జీ స్టూడియోస్ మరియు వేఫేరర్ ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. జేక్స్ బిజోయ్ మరియు షాన్ రెహమాన్ సంయుక్తంగా సంగీతం అందించగా, నిమిష్ రవి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa