ఇప్పుడున్న కుర్ర హీరోల్లో కాస్త డిఫరెంట్‌గా, అవుట్ ఆఫ్ ది బాక్స్ కంటెంట్‌తో సినిమాలు చేస్తుంది ఒక్క నిఖిల్ మాత్రమే. ఆయన లైనప్ చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తుంది. పెద్ద పెద్ద స్టార్‌లు సైతం నిఖిల్ స్క్రిప్ట్ సెలక్షన్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే కార్తికేయ-2తో పాన్ ఇండియా లెవల్లో సాలిడ్ మార్కెట్ పెంచుకున్న నిఖిల్.. అలాంటివే మరో రెండు హిట్లు పడితే టైర్1 హీరోల సాటి నిలివడం ఖాయం. మొన్నటికి మొన్న డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న స్పై సైతం భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ఫైనల్ రన్‌లోనూ ఈ సినిమా పెద్దగా నష్టాలు తెచ్చిపెట్టలేదు. ఇక ప్రస్తుతం నిఖిల్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్నవే. అందులో స్వయంభు ఒకటి. తమిళంలో పలు సినిమాలు రైటర్‌గా పని చేసిన భరత్ కృష్ణమాచారి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
నెలన్నర రోజుల కిందట రిలీజైన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ఊహించని రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది. యుద్ద వీరుడి గెటప్‌లో ఉన్న నిఖిల్ లుక్‌కు ఫిదా అవని సినీ ప్రేక్షకుడు లేడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ మేరకు మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. గుర్రపు స్వారిపై డ్రాగన్ నోటిలో మంటలు చెలరేగుతున్న బాణం ఎక్కుపెట్టి యుద్ద వీరుడుగా ఉన్నట్లు నిఖిల్ పోస్టర్‌ను వీర లెవల్లో డిజైన్ చేశారు. పోస్టర్‌తోనే సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలు నెలకొల్పుతున్నారు. ఈ పీరియాడిక్ డ్రామా సినిమాకు రవిబస్రూర్, రామకృష్ణ పరమహంస వంటి స్టార్ టెక్నిషన్‌లు పనిచేస్తున్నారు.
టాలీవుడ్ లక్కి గర్ల్ సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను భువన్ , శ్రీకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే నిఖిల్, రామ్‌చరణ్ నిర్మాణంలో ది ఇండియన్ హౌజ్ అంటూ ఓ భారీ పాన్ ఇండియా సినిమాను ప్రకటించాడు. ఇక కార్తికేయ సిరీస్‌లో మూడో ఇన్‌స్టాల్‌మెంట్ ఎలాగో ఉండనే ఉంది. షూటింగ్ కాస్తా లేటవ్వచ్చేమో కానీ.. సినిమా తెరకెక్కడం మాత్రం పక్కా. ఇక ఆ లోపే స్వయంభూ కూడా ఫినీష్ అవ్వనుంది. ఎలా చూసుకున్న రానున్న రెండు, మూడేళ్లలో టాలీవుడ్‌లో నిఖిల్ చక్రం తిప్పడం ఖాయంగా అనిపిస్తుంది.
NIKHIL SIDDHARTHA: PAN-INDIA FILM ‘SWAYAMBHU’ SHOOT BEGINS… #Swayambhu - starring #NikhilSiddhartha - commences shoot today… Also features #SamyukthaMenon.
Directed by #BharatKrishnamachari… Music by #RaviBasrur… Produced by #Bhuvan and #Sreekar… In #Telugu, #Hindi, #Tamil,… pic.twitter.com/3cREYqOqBQ
— taran adarsh (@taran_adarsh) August 18, 2023
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa