ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందాలతో పిచ్చెక్కించిన రితికా సింగ్‌

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 09, 2023, 03:36 PM

బాక్సింగ్‌ నుంచి సినిమాల్లోకి వచ్చి అందాల విందుతో దుమ్ములేపుతుంది రితికా సింగ్‌. అందాల జోరు చూపిస్తూ కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. ప్రస్తుతం చీరలో ఈ బ్యూటీ మత్తెక్కిస్తుంది. `గురు` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయ్యింది రితికా సింగ్‌. ఇందులో బాక్సర్‌గా నటించింది. వెంకటేష్‌ హీరోగా రూపొందిన చిత్రమిది. తమిళంలో వచ్చిన `ఇరుదు సుట్రు` చిత్రానికి రీమేక్‌. సినిమాలో రియల్ బాక్సర్‌గా కనిపించి వాహ్‌ అనిపించింది. అందరి చూపు తనవైపు తిప్పుకుంది. ఈ సినిమాకిగానూ ఆమెకి ఏకంగా స్పెషల్‌ మెన్షన్‌లో జాతీయ అవార్డు దక్కడం విశేషం. దీంతో అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంది. `ఇరుదు సుట్రు`ని తెలుగులో `గురు`గా రీమేక్‌ చేసిన విషయం తెలిసిందే. అలా తెలుగు ఆడియెన్స్ కి పరిచయమైందీ హాట్‌ బ్యూటీ. తమిళంలో `ఆందవన్‌ కట్టలై`, `శివలింగ` చిత్రాలతో మెరిసింది. మరోసారి 2018లో `నీవెవరో` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని పలకరించింది. ఆదిపినిశెట్టి హీరోగా రూపొందిన చిత్రమిది. తాప్సి హీరోయిన్‌గా నటించగా, రితికా సింగ్‌ కీలక పాత్ర పోషించింది. ఇలా అడపాదడపా సినిమాలు చేస్తూ రాణిస్తుంది. ఇక ఇప్పుడు ఐటెమ్‌ సాంగ్‌ కూడా చేసింది. మలయాళంలో రూపొందిన `కింగ్‌ ఆఫ్‌ కోథ`లో స్పెషల్‌ సాంగ్‌ చేసింది. తనదైన గ్లామర్‌ ట్రీట్ తో మంత్రముగ్దుల్ని చేసింది. `కాలపక్కార` అంటూ సాగే ఈ స్పెషల్‌ సాంగ్‌లో తన దైన ఘాటు రేపే అందాలతో పిచ్చెక్కించిందీ బ్యూటీ. అంతేకాదు మాస్‌ డాన్సుతో రచ్చ చేసింది. ఈ సాంగ్‌ ట్రెండ్‌ అవుతుంది. ఈ సినిమా ఈ నెల 25న రాబోతుంది. తెలుగులోనూ రిలీజ్‌ కానుంది. 


 


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa