సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' సినిమా ఆగస్టు 10న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఇటీవల చెన్నైలో నిర్వహించారు. ఆ వేడుకలో రజనీ మాట్లాడుతూ ‘మొరగని కుక్కలేదు. విమర్శించని నోరు లేదు. ఈ రెండూ జరగని ఊరే లేదు. మనం మన పని చేసుకుంటూ పోవాలి' అని తమిళంలో అన్నారు. అయితే ‘అర్థమైందా రాజా?’ అని చివర్లో అన్నారు. ఈ వ్యాఖ్యలు ఏపీలో వైసీపీ నేతలను ఉద్దేశించి చేసినవే అని నెట్టింట చర్చ సాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa