ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌లో పునఃప్రారంభమైన 'కల్కి 2898 AD' షూటింగ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 08, 2023, 05:31 PM

నాగ్ అశ్విన్‌  దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాకి మూవీ మేకర్స్ 'ప్రాజెక్ట్ కల్కి 2898 AD' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో యంగ్ రెబెల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె నటిస్తుంది. తాజగా ఇప్పుడు ఈ చిత్రం యొక్క కొత్త షూటింగ్ షెడ్యూల్  హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఆగస్ట్ 28, 2023 వరకు ముఖ్య నటీనటులతో ముఖ్యమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో మూవీ మేకర్స్ చిత్రీకరిస్తారు.

అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పాన్-ఇండియా బిగ్గీ సంక్రాంతి పండుగ ట్రీట్‌గా ప్రపంచవ్యాప్తంగా 12 జనవరి 2024న విడుదలవుతుంది అని మూవీ మేకర్స్ ప్రకటించారు. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో కమల్ హాసన్, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ మరియు ఇతరులు కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ హై బడ్జెట్ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa