నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా మాస్ లుక్ తో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ 'దసరా'. ఈ సినిమా రిలీజ్ అయి 100 రోజులు పూర్తవడంతో మేకర్స్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి చిత్ర యూనిట్ తో పాటు హీరో నాని, సాయి కుమార్, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల హాజరయ్యారు. బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ మూవీ.. రూ.130 కోట్ల వరకూ కలెక్షన్లను రాబట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నాని 'హాయ్ నాన్న' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa