టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని పవర్‌ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో పాన్-ఇండియా సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. నిర్మాతలు ఈ చిత్రానికి 'స్కంద-ది ఎటాకర్' అనే టైటిల్ ని పెట్టారు. తాజాగా థమన్ స్వరపరిచి సిద్ శ్రీరామ్ మరియు సంజన కల్మంజే చక్కగా పాడిన నీ చుట్టు చుట్టు అనే మొదటి సింగిల్‌ని మూవీ మేకర్స్ విడుదల చేసారు. ఈ ఎనర్జిటిక్ ట్రాక్ కి రఘురామ్ సాహిత్యం రాశారు.
లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ మెలోడీ మరియు హై-ఎనర్జీ బీట్ సాంగ్ ఇప్పుడు భారతదేశంలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ సినిమాలో రామ్ సరసన శ్రీ లీల జోడిగా నటిస్తుంది. ఈ సినిమా 15 సెప్టెంబర్ 2023న విడుదలవుతోంది. ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఫుల్ మాస్ ఎలిమెంట్స్‌తో రానున్న ఈ సినిమాని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa