టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ తన ఇటీవలి చిత్రం 'బేబీ' సినిమాతో అఖండ విజయం సాధించారు. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ హిట్ మూవీలో వైష్ణవి చైతన్య మరియు విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించారు. విడుదలైన నాలుగో వారం కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద జోరు కొనసాగిస్తోంది.
తాజాగా ఇప్పుడు, కెవి గుహన్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ నటించిన 'హైవే' చిత్రం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ట్రాక్ లో వచ్చిన ఈ చిత్రం యొక్క తమిళ వెర్షన్ రేపు ఆహాలో ప్రదర్శించబడుతుంది అని సమాచారం.
ఈ చిత్రంలో కథానాయికగా మానసా రాధాకృష్ణన నటించగా జాన్ విజయ్, రేష్మా పసుపులేటి, సత్య తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్ బ్యానర్‌పై వెంకట్ తలారి ఈ చిత్రాన్ని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa