పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్' సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ గా నిలిచింది. చాలా కాలం క్రితం, సర్దార్ సీక్వెల్ ఉంటుందని చిత్ర బృందం ప్రకటించింది. సీక్వెల్‌కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ సీక్వెల్ కు జివి ప్రకాష్ కుమార్ స్థానంలో యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నట్లు సమాచారం. అతి త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.లక్ష్మణ్ కుమార్ సర్దార్ 2ని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa