ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 31, 2023, 05:17 PM

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని మరియు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'డబుల్ ఇస్మార్ట్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ జూలై రెండో వారంలో ముంబైలో ప్రారంభమైంది.


తాజాగా ఈరోజు ఉదయం పూరీ జగన్నాధ్‌తో కలిసి డబుల్ ఇస్మార్ట్ నిర్మిస్తున్న నటి ఛార్మీ ట్విట్టర్‌లో ఈ సినిమా గురించిన లేటెస్ట్ అప్డేట్ ని పంచుకున్నారు. ఈ సినిమా యొక్క ముంబై షెడ్యూల్ పూర్తయిందని తదుపరి షెడ్యూల్ విదేశాల్లో జరగనుందని ఛార్మి హీరో రామ్‌తో ఉన్న చిత్రాన్ని పోస్ట్ చేసి వెల్లడించింది.

ఈ పాన్ ఇండియా సినిమా మహా శివరాత్రికి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో మార్చి 8, 2024న విడుదల కానుంది. పూరి జగన్నాధ్ మరియు ఛార్మి కౌర్ కలిసి పూరీ కనెక్ట్స్‌పై, విషు రెడ్డి CEOగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa