ట్రెండింగ్
Epaper    English    தமிழ்

VS11 : టైటిల్ మరియు ఫస్ట్ గ్లింప్సె విడుదలకి తేదీ లాక్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 29, 2023, 08:23 PM

కృష్ణ చైతన్య దర్శకత్వంలో మాస్ కా దాస్ విశ్వక్సేన్ తన తదుపరి చిత్రాన్ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'VS 11' అని తాత్కాలికంగా పేరు పెట్టారు. ఇటీవల మూవీ మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఇప్పుడు, ఈ సినిమా యొక్క టైటిల్ ప్రకటన మరియు ఫస్ట్ గ్లింప్సె జూలై 31వ తేదీన ఉదయం 10:19 గంటలకు విడుదల కానున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.

ఈ సినిమాలో అంజలి, నేహా శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa