ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'జవాన్' ఫస్ట్ సింగల్ విడుదలకి సర్వం సిద్ధం

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 25, 2023, 09:02 PM

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ సౌత్ డైరెక్టర్ అట్లీతో ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. ఈ చిత్రానికి 'జవాన్' అనే టైటిల్ ను మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ మూవీలో షారూఖ్ ఖాన్ సరసన జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం యొక్క మొదటి సింగిల్ జిందా బందా ఆగస్టు మొదటి వారంలో విడుదల కానుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పాట విడుదల తేదీని మూవీ మేకర్స్ త్వరలో అధికారకంగా ప్రకటించనున్నారు.

ఈ చిత్రం సెప్టెంబర్ 7, 2023న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా అండ్ సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa