ఎఆర్ శ్రీధర్ దర్శకత్వంలో సంజయ్ రావు నటిస్తున్న 'స్లమ్ డాగ్ హస్బెండ్' చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. పిట్టకథ సినిమాతో తెరంగేట్రం చేసిన యువ నటుడు సంజయ్‌రావు తాజాగా 'స్లమ్ డాగ్ హస్బెండ్' అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా జూలై 21, 2023న థియేటర్లలో విడుదల కానుంది.
లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెన్సార్ బోర్డ్ నుండి U/A సర్టిఫికెట్ పొందినట్లు సమాచారం. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సునీల్, సప్తగిరి, రఘు కారుమంచి, యాదమ్మ రాజు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందించారు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న స్లమ్ డాగ్ హస్బెండ్ చిత్రాన్ని మైక్ మూవీస్ బ్యానర్‌పై అప్పిరెడ్డి మరియు వెంకట్ అన్నపరెడ్డి నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa